అక్షరటుడే, వెబ్డెస్క్: Vijay Sethupathi | ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్(industry hit) సినిమాలను అందించిన డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్(director) పూరీ జగన్నాథ్ ఇప్పుడు వరుస ఫ్లాపులతో కెరీర్(career) లో బ్యాడ్ టైం ఫేస్ చేస్తున్నాడు. ముఖ్యంగా స్టార్ హీరోలు ఎవరు ఆయన్ను నమ్మే పరిస్థితి కనిపించట్లేదు. రాం తో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేసిన పూరీ ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకోగా అది కాస్త నిరాశపరచింది. ఇక తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అన్న కన్ ఫ్యూజన్ కి దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే అని తెలుస్తుంది.
కోలీవుడ్(Kollywood) స్టార్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ సినిమా లాక్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా గురించి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్(official announcement) రాలేదు కానీ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక రేంజ్ హంగామా నడుస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియా(social media)లో ఒక టాక్ నడుస్తుంది.
Vijay Sethupathi | పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి కలయికలో..
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి కలయికలో వస్తున్న సినిమాకు బెగ్గర్ అనే టైటిల్(title) లాక్ చేశారట. ఈ సినిమా(film) కథ విజయ్ సేతుపతిని ఇంప్రెస్ చేసిందని టాక్. అందుకే విజయ్ సేతుపతి వెంటనే ఒప్పుకున్నాడని తెలుస్తుంది. ఒకప్పుడు పూరీ సినిమా అంటే స్టార్స్ వెంటపడే వారు కానీ ఇప్పుడు అతను పూర్తిగా ట్రాక్ తప్పాడని అవకాశాలు(opportunities) ఇవ్వట్లేదు.
ఇక బెగ్గర్ విషయానికి వస్తే.. ఆల్రెడీ విజయ్ ఆంటోని(Vijay Antony) బిచ్చగాడు సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు విజయ్ సేతుపతి బెగ్గర్(Beggar) గా రాబోతున్నాడు. మరి విజయ్ సేతుపతి ఏరి కోరి చేస్తున్న సినిమా ఎలా ఉంటుందో చూడాలి. విజయ్ సేతుపతి కి తెలుగు(Telugu)లో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక పూరీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. మరి ఈ ఇద్దరు చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ముందుగా బెగ్గర్ అనే టైటిల్ రివీల్ కాగానే ట్రెండింగ్ లో ఆ టైటిల్ ఉండేలా చేస్తున్నారు.