vijayasai reddy | టీడీపీతో విజ‌య‌సాయిరెడ్డి సెటిల్మెంట్ అయిన‌ట్టేనా.. ఇక వారి ప‌ని అంతే!

vijayasai reddy | టీడీపీతో విజ‌య‌సాయిరెడ్డి సెటిల్మెంట్ అయిన‌ట్టేనా.. ఇక వారి ప‌ని అంతే!
vijayasai reddy | టీడీపీతో విజ‌య‌సాయిరెడ్డి సెటిల్మెంట్ అయిన‌ట్టేనా.. ఇక వారి ప‌ని అంతే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: vijayasai reddy | రాజ‌కీయాలు ఒక్కోసారి ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. ఎలా అంటే ఒక పార్టీకి కీల‌క నేత‌గా key leader ఉన్న వ్య‌క్తి మ‌రో పార్టీలోకి జంప్ అవ్వ‌డం, ఆపోజిట్ పార్టీలో ప‌రిస్థితుల‌ని మార్చ‌డం రాజ‌కీయాలు Politics రంజుగా మారేలా చేస్తుంటాయి. వైసీపీ YSRCP నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన విజ‌య‌సాయి రెడ్డి vijayasai reddy రాజ‌కీయాల‌కి దూరంగా ఉంటానంటూ ప్ర‌క‌టించాడు. కాని ఒట్టు తీసి గట్టుమీద పెట్టాలని, మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారని ప్రచారం జరుగుతోంది. తన రాజకీయ పునరాగమనానికి political comeback ఎలాంటి అడ్డంకులు లేకుండా అధికార పార్టీతో డీల్ సెట్ చేసుకునేలా విజయసాయిరెడ్డి పావులు కదుపుతున్నట్లు నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతుంది.

Advertisement
Advertisement

vijayasai reddy | వైసీపీకి చెక్..

విజయసాయిరెడ్డిని vijayasai reddy బీజేపీలోకి BJP తీసుకుని, మళ్లీ రాజ్యసభకు పంపడమే కాకుండా, ఆయన ద్వారా వైసీపీలోని ముఖ్య నేతలను బీజేపీలోకి తేవాలని ఢిల్లీ బీజేపీ పెద్దలు ప‌క్కా ప్లాన్స్ అమ‌లు చేస్తున్న‌ట్టుగా ఓ టాక్ న‌డుస్తుంది. కూట‌మిలోని ప్ర‌ధాన పార్టీల‌ని ఒప్పించి వైసీపీకి చెక్ పెట్టేలా బీజేపీ హైకమాండ్ BJP high command భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు. విజయసాయిరెడ్డిని చేర్చుకోవడం ద్వారా వైసీపీకి చెక్ పెట్టొచ్చని.. గత ప్రభుత్వంలోని government కొన్ని కీలక కుంభకోణాల విషయంలో ఆధారాలు లభించేలా విజయసాయిరెడ్డి సహకరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవ‌ల కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ విషయమై నమోదైన కేసు case registered విచారణ సందర్భంగా లిక్కర్ స్కాంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఇది కూడా చ‌ద‌వండి :  Liquor Brands | మద్యంప్రియులకు గుడ్​న్యూస్​.. త్వరలో కొత్త బ్రాండ్లు

తగిన సమయంలో మరిన్ని వివరాలు వెల్లడిస్తానని విజయసాయిరెడ్డి Vijaysai reddy చేసిన ప్ర‌క‌ట‌న‌ ప్రకంపనలు పుట్టించింది. ఇటీవల కాలంలో లిక్కర్ స్కాం కేసు liquor scam case దర్యాప్తు investigation వేగవంతం కావడం, నిందితులు తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తుండటంతో విజయసాయిరెడ్డి ప్రాధాన్యం పెరిగిందని అంటున్నారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వంతో government స‌ఖ్య‌త కోరుకుంటున్న విజ‌య‌సాయి రెడ్డి గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న అనేక అంశాల్లో సర్కారుకు సహకరిస్తానని భరోసా ఇస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ కల్పించుకుని కీలకమైన లిక్కర్ స్కాంను సీబీఐ, ఈడీతో CBI and ED దర్యాప్తు చేయించాలని ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో విజయసాయిరెడ్డి వ్యవహరించిన వైఖరి కారణంగా టీడీపీ నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రావడం లేదని చెబుతున్నారు. బీజేపీ పెద్దల ఆసక్తి మేరకు విజయసాయిరెడ్డి ఆ పార్టీ కండువా త్వరలోనే కప్పుకోవచ్చని అంటున్నారు. చూడాలి మ‌రి రానున్న రోజుల‌లో ఏం జ‌రిగిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

Advertisement