అక్షరటుడే, వెబ్ డెస్క్: Vijayashanti : సీనియర్ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (Vijayashanti) కొద్దిరోజులుగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ (Arjun Son of Vyjayanthi Movie) ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అయితే విజయశాంతి (Vijayashanti) దంపతులను ఎం.చంద్రకిరణ్‌రెడ్డి అనే వ్యక్తి చంపేస్తానని బెదిరిస్తున్నాడట. ఈ క్రమంలో చంద్రశేఖర్ అనే వ్యక్తిపై బంజరాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నాడని, తమ అంతు చూస్తామని మెసేజ్‌లు చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్. (MV Srinivasa Prasad) తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తమ పరువు బజారుకీడ్చడమే కాకుండా.. ఇద్దరిని చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ విజయశాంతి దంపతులు పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది.
Vijayashanti : బెదిరింపులు..
విజయశాంతి భర్త ఎంవీ శ్రీనివాస ప్రసాద్‌కు (MV Srinivasa Prasad) నాలుగేళ్ల క్రితం ఎం.చంద్రకిరణ్‌రెడ్డి అనే వ్యక్తి పరిచయం కాగా, అతను సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చెప్పాడట. అయితే పనితీరు చూశాక కాంట్రాక్ట్ ఇస్తామని శ్రీనివాస ప్రసాద్ హామీ ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత అనుకున్న ఫలితాలు రాకపోవడంతో చంద్రకిరణ్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా పంపించేశారు. ఈ విషయంలో కొన్నాళ్లు సైలెంట్ అయిన చంద్రశేఖర్.. ఇప్పుడు శ్రీనివాస్ ప్రసాద్ కు మెసేజ్ చేస్తూ డబ్బులు పంపించాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడట. పరువు తీస్తానని.,. ఇద్దరిని చంపేస్తానని మెసేజ్స్ messages చేస్తున్నాడని శ్రీనివాస్ ప్రసాద్ పోలీసులను ఆశ్రయించడంతో చంద్రకిరణ్ రెడ్డిపై కేసు నమోదైంది.
చంద్రకిరణ్.. విజయశాంతి వద్ద పనిచేస్తున్నానని చెప్పి పలువురు రాజకీయ నాయకుల వద్ద కూడా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. అయితే ఒప్పందం జరగకున్నా డబ్బులు ఎందుకు ఇవ్వాలని విజయశాంతి భర్త ప్రశ్నిండచంతో పాటు ఇంటికి వచ్చి మాట్లాడమని సూచించారట. అయితే ఆయన ఇంటికి రాకపోగా, డబ్బులు ఇవ్వకపోతే మీ బతుకులను రోడ్డున పడేస్తానని, కసి తీరేవరకు దారుణంగా చంపుతానంటూ మెసేజ్‌లు పెడుతున్నారట. దీంతో శ్రీనివాస ప్రసాద్ sinivas prasad అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.