మిషన్‌ భగీరథ ట్యాంక్‌లో కోతి కళేబరం

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిర్మల్‌ జిల్లాలోని కుభీర్‌ మండలం నిగ్వ గ్రామంలోని మిషన్‌ భగీరథ ట్యాంక్‌లో కోతి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. వారం రోజులుగా ఇవే నీళ్లు తాగుతున్నామని, స్థానిక అధికారులకు నీళ్లలో దుర్వాసన విషయాన్ని చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, ట్యాంక్‌ను వెంటనే శుభ్రం చేయించాలని వారు డిమాండ్‌ చేశారు.