అక్షరటుడే, నిజాంసాగర్: మండలంలోని అచ్చంపేట, ఆరేపల్లి ఎంపీటీసీ స్థానాలను యథావిధిగా కొనసాగించాలని గ్రామస్థులు కోరారు. ఈ మేరకు అచ్చంపేట, ఆరేపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామస్థులు శుక్రవారం ఎంపీడీవో గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. గతంలో అచ్చంపేట ఎంపీటీసీ స్థానం, ఆరేపల్లి బ్రాహ్మణపల్లి కలిపి ఒక స్థానం ఉండేవన్నారు. ప్రస్తుతం అచ్చంపేట ఆరేపల్లి కలిపి ఒక ఎంపీటీసీ స్థానాన్ని బ్రాహ్మణపల్లి గ్రామాన్ని వెలగనూరు ఎంపీటీసీ స్థానంలో విలీనం చేశారని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే కొనసాగించాలని కోరారు. నాయకులు సత్యనారాయణ, రమేష్, వెంకటేశం, గౌరయ్య, శ్రీనివాస్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీటీసీ స్థానాలను యథావిధిగా కొనసాగించాలి
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : గుడ్‌న్యూస్.. మహిళలకు భారీ శుభవార్త.. రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు
Advertisement