Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: దోమకొండ మండలం ముత్యంపేటలో ప్రాథమిక పాఠశాల ప్రహరీ కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు గ్రామస్థులు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిని కోరారు. శుక్రవారం ఆయన్ను కలిసి మాట్లాడారు. ఈ నెల 29న రాత్రి ముత్యంపేట మాజీ ఉపసర్పంచ్ శిరీష్ గౌడ్, అతని అనుచరులు ఉద్దేశ పూర్వకంగా పాఠశాల ప్రహరీ కూల్చివేశారని ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement