అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ రూరల్‌లోని రాంపూర్ గ్రామానికి చెందిన వెంకన్నోళ్ల ఓంకార్ (22) అనే డిగ్రీ విద్యార్థి డెంగీతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. రాంపూర్ గ్రామానికి చెందిన వెంకన్నోళ్ల లత, రాజేందర్ కుమారుడైన ఓంకార్ హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నాడు.విద్యార్థికి జ్వరం రావడంతో రాంపూర్‌నకు రాగా సోమవారం ఉదయం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం ఓంకార్ మృతి చెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.