అక్షరటుడే, బాన్సువాడ: వర్ని మండలం సిద్దాపూర్ తండాలో నూతన శివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం గ్రామంలో దేవతామూర్తులను గ్రామస్తులు కలశాలతో ఊరేగింపు చేపట్టారు. ఆలయం వద్ద వేద పండితులు దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గురువారం ఆలయ ప్రారంభోత్సవానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.