అక్షరటుడే, ఆర్మూర్: మండలంలోని కోమన్‌పల్లికి చెందిన ముత్తెన్న అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సీఎం సహాయ నిధి నుంచి రూ.95వేల ఎల్‌వోసీ మంజూరు చేయించారు. ఎల్‌వోసీని శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.