Viral Video : రైల్వే క్రాసింగ్ దాటేందుకు బండిని భుజాల మీద‌కు ఎత్తి బాహుబ‌లిలా మారిన యువ‌కుడు

Viral Video : రైల్వే క్రాసింగ్ దాటేందుకు బండిని భుజాల మీద‌కు ఎత్తి బాహుబ‌లిలా మారిన యువ‌కుడు
Viral Video : రైల్వే క్రాసింగ్ దాటేందుకు బండిని భుజాల మీద‌కు ఎత్తి బాహుబ‌లిలా మారిన యువ‌కుడు
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Viral Video : ఈ రోజుల్లో మ‌నుషుల‌కి ఓపిక ఉండ‌డం లేదు. కొద్దిసేపు వేచి చూడాల‌న్నా కూడా వారికి ఇబ్బందిగా ఉంటుంది. స‌మ‌యం చాలా వాల్యుబుల్ కాబ‌ట్టి కొంచెం స‌మ‌యం కూడా వేస్ట్ చేసేందుకు ఎవ‌రు ఆస‌క్తి చూప‌డం లేదు. అందుకే రైల్వే క్రాసింగ్ ద‌గ్గ‌ర ఓ వ్య‌క్తి బాహుబ‌లి మాదిరిగా బైక్ పైకి లేపి ట్రాక్ దాటి అటు వైపుకి వెళ్లాడు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఢిల్లీ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. రైలు వస్తుండటంతో గేట్ మ్యాన్ గేటును మూసివేశారు. అయితే, రైలు వెళ్లేంత వరకు వేచి చూడలేని ఓ యువకుడు బైకు మోసుకుంటూ గేటుదాటాడు.

Viral Video : ఓపిక లేదు..

ఇది చూసిన మిగిలిన వాహనదారులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ అత‌డిని త‌మ కెమెరాల‌లో బంధించారు. రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైకు ఎత్తిన యువకుడుని అభినవ బాహుబలిగా వ‌ర్ణిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. బైక్ వాలా రైలు వచ్చేంత వరకు వేచి చూడటం వృథా అనుకున్నాడో ఏమో కాని వెంటనే బైకును భుజానికి ఎత్తుకుని రైల్వే గేటు దాటాడు. ఇది ప్ర‌తి ఒక్కరిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. రైలు గేటు వేసినా కూడా కొందరు అడ్డదిడ్డంగా దాటడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదాలకు గురవుతుంటారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Viral Video : సెల్‌ఫోన్ పిచ్చి ఎట్ పీక్స్.. చార్జింగ్ లేదని ఫోన్‌ను ఏం చేశాడో చూడండి

కొన్ని సంద‌ర్భాల‌లో అయితే ఏకంగా ప్రాణాలే కోల్పోతుంటారు. మరికొందరు అదృష్టం బాగుండి ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ఇక్క‌డ రైల్వే క్రాసింగ్‌ వద్ద వేచి ఉండటాన్ని ఒక బైకర్ సహించలేక ఏకంగా ఎత్తేసుకొని వెళ్లిపోయాడు. భ‌లే వాడివి బాసు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement