virat kohli | టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి ఏషియన్ బ్యాట‌ర్‌గా.!

virat kohli | టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి ఏషియన్ బ్యాట‌ర్‌గా.!
virat kohli | టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి ఏషియన్ బ్యాట‌ర్‌గా.!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: virat kohli | ర‌న్‌ మెషీన్ విరాట్ కోహ్లీకి run machine Virat Kohli రికార్డులు కొత్త కాదు. పాత రికార్డులన్నింటినీ చెరిపేస్తూ విరాట్ కోహ్లీ ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంటాడు. టెస్టు, వన్ డే, టీ20, ఐపీఎల్ IPL అని తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలో తనదైన ముద్ర వేస్తున్నాడు. తాజాగా కింగ్ కోహ్లీ త‌న ఖాతాలో మ‌రో రికార్డు new record చేర్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో IPL రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో RCB Team స్టార్ బ్యాటర్​గా ఉన్న కోహ్లీ.. T20ల్లో 100 హాఫ్ సెంచరీలు half-centuries సాధించిన భారత తొలి బ్యాటర్​గా రికార్డులకెక్కాడు. జైపూర్‌లోని Jaipur సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో Rajasthan Royals జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. 174 పరుగుల లక్ష్య ఛేదనలో వనిందు హసరంగ Wanindu Hasaranga బౌలింగ్‌లో సిక్సర్ బాది 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Advertisement
Advertisement

virat kohli | ఇది క‌దా కోహ్లీ అంటే..

కోహ్లీ Virat Kohli అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ జట్టు రాజస్థాన్​పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ half-centurie పూర్తి చేసిన కింగ్ కోహ్లీ King kohli.. ఈ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ కోహ్లీ T20ల్లో ఇప్పటివరకు 405 మ్యాచ్​లు ఆడాడు. అందులో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ లిస్టులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లీ. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ డేవిడ్ వార్నర్ David Warner 108 హాఫ్ సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు.. కోహ్లీ తర్వాత టీమిండియా నుంచి టాప్​–10లో రోహిత్ శర్మ Rohit Sharma మాత్రమే ఉండడం గమనార్హం. రోహిత్ ప్రస్తుతం 78 హాఫ్ సెంచరీలతో ఈ లిస్ట్​లో 9వ స్థానంలో ఉన్నాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  RCB | ఆర్సీబీకి అదృష్టంగా మారిన గ్రీన్ క‌లర్ జెర్సీ.. ఆ డ్రెస్ వేశారా గెలుపు త‌థ్యం

టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు most half-centuries చేసిన ఆటగాళ్ల లిస్టు చూస్తే.. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 108, విరాట్ కోహ్లీ (భారత్)- 100, బాబర్ అజామ్ (పాకిస్థాన్)- 90, క్రిస్ గేల్ Chris Gayle (వెస్టిండీస్)- 88, జాస్ బట్లర్ (ఇంగ్లాండ్)- 86.. ఉన్నారు. విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించడంపై క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, విరాట్ కోహ్లీ అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌కి international T20 cricket గుడ్ బై చెప్పిన విష‌యం తెలిసిందే. కోహ్లీ భారత్ తరఫున 125 టీ20 మ్యాచ్‌లు ఆడి 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత ఏడాది జూన్ 29న కెన్సింగ్టన్ ఓవల్‌లో దక్షిణాఫ్రికాతో South Africa జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో 59 బంతుల్లో 76 పరుగులు చేసి భారత్ విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. భారత్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత కోహ్లీ అంతర్జాతీయ international టీ20లకు T20 వీడ్కోలు పలికాడు.

Advertisement