Virat Kohli : వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ టార్గెట్ పెట్టుకున్న కోహ్లీ.. రిటైర్మెంట్ వార్త‌ల‌కి చెక్ ప‌డ్డ‌ట్టేనా?

Virat Kohli : వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ టార్గెట్ పెట్టుకున్న కోహ్లీ.. రిటైర్మెంట్ వార్త‌ల‌కి చెక్ ప‌డ్డ‌ట్టేనా?
Virat Kohli : వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ టార్గెట్ పెట్టుకున్న కోహ్లీ.. రిటైర్మెంట్ వార్త‌ల‌కి చెక్ ప‌డ్డ‌ట్టేనా?

అక్షర టుడే, వెబ్ డెస్క్ Virat Kohli : ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈ వ‌య‌స్సులోను అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. ప‌లుమార్లు ఆయ‌న రిటైర్మెంట్ గురించి వార్త‌లు వ‌స్తుండ‌గా, వాటిని కోహ్లీ ఏదో ఒక విధంగా ఖండిస్తూనే ఉన్నారు. భారత్ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 ప్రపంచకప్ 2024 (T20 World Cup 2024) టైటిల్ సాధించిన తర్వాత టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతుండ‌గా, ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో 80కి పైగా సగటుతో (Virat Kohli) కోహ్లీ క‌ప్ అందుకోవ‌డంతో కీల‌క పాత్ర పోషించాడు. ఇప్పుడు కోహ్లీ (Virat Kohli) టార్గెట్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌పై ఉంది. కోహ్లీ వ‌న్డేల‌కి కూడా గుడ్ బై చెబుతాడ‌న్న ప్ర‌చారంలో ఆయ‌న కీల‌క కామెంట్స్ చేశాడు.

Advertisement
Advertisement

Virat Kohli : కోహ్లీ టార్గెట్ ఇదే..

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy) విజయం తర్వాత రోహిత్‌తో (Rohit Sharma) పాటు కోహ్లీ (Virat Kohli) వ‌న్డే ఫార్మాట్‌ నుంచి తప్పుకుంటారని వార్తలు రాగా, రోహిత్‌ దానిని కొట్టిపారేయడం మ‌నం చూశాం. తాజాగా కోహ్లీ (Virat Kohli) తన భవిష్యత్‌ ప్రణాళికల గురించి తెలిపాడు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీని యాంకర్‌.. ‘మీ నెక్స్‌ బిగ్‌ స్టెప్‌ గురించి ఏమైనా హింట్‌ ఇస్తారా’ అని అడిగింది. దానికి కోహ్లీ (Virat Kohli) స్పందిస్తూ.. ‘నిజంగా నాక్కూడా తెలీదు. బహుశా తర్వాతి వన్డే ప్రపంచకప్‌ గెలవడమేమో!’ అంటూ చెప్ప‌డంతో విరాట్ వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు ఆడ‌తాడ‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక కోహ్లీ ప్ర‌స్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  Retirement | ఎంఈవో వెంకటేశంకు సన్మానం

తాజా సీజ‌న్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (RCB) అదరగొడుతోంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఘన విజయం సాధించింది.17 ఏళ్ళ క్రితం మిస్టర్ వాల్ కెప్టెన్సీలో ఆర్సీబీ జట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత ఆర్సీబీ మాత్రం చెన్నైలో ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. ఎట్టకేలకు ఈ సీజన్ లో రజత్ పాటీదార్ (Rajat Patidar) కెప్టెన్సీలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ దానిని బ్రేక్ చేసింది. చెన్నైలో చెన్నైని ఓడించి సూపర్ విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ రోజు గుజ‌రాత్‌తో ఆర్సీబీ సొంత మైదానంలో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌నుంది.

Advertisement