అక్షరటుడే, వెబ్ డెస్క్ : స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి తన ఖాతాలో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఎక్కువ పరుగులు సాధించిన ఘనతను సొంతం చేసుకున్నారు. గతంలో 623 ఇన్నింగ్‌లో టెండూల్కర్ 27వేల రన్స్‌ చేయగా.. దానిని కోహ్లి 594 ఇన్సింగ్స్‌లోనే చేశారు. కాగా.. 27వేల పరుగుల ఫీట్‌ను ఇప్పటి వరకు నలుగురు సాధించారు. ఇందులో కోహ్లీ, సచిన్‌, కుమార సంగక్కర(శ్రీలంక), రికీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా) ఉన్నారు.