అక్షర టుడే, వెబ్ డెస్క్ Virat Kohli : ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచి హ్యాట్రిక్‌పై కన్నేసిన (RCB) ఆర్సీబీకి పెద్ద షాకే తగిలింది. గుజరాత్‌పై దారుణంగా ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ (RCB) నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. అనంతరం 170 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన గుజరాత్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే, రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఈజీ టార్గెట్‌ను అందుకుంది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సాయి సుదర్శన్ (Sai Sudarshan) (36 బంతుల్లో 49 పరుగులు), (Jos Butler) జాస్ బట్లర్ (39 బంతుల్లో 73 పరుగులు) బ్యాట్ ఝుళిపించడంతో 17.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. అయితే ఒకవైపు ఆర్సీబీ ఓటమి ఫ్యాన్స్‌ని బాధిస్తుంటే మరోవైపు (Virat Kohli) విరాట్ కోహ్లీ గాయం కలవరపరుస్తుంది.
Virat Kohli : కలవరపెడుతున్న కోహ్లీ గాయం..
గుజరాత్ టైటాన్స్‌తో (Gujarat Titans) జరిగిన మ్యాచ్ 12వ ఓవర్ లో కృనాల్ పాండ్య (Krunal Pandya) వేసిన షార్ట్ బంతికి సాయి సుదర్శన్ పుల్ ఆన్ ఆడాడు. అయితే ఆ బాల్.. డీప్ మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేసిన కోహ్లీ (Virat Kohli) చేతి వేలికి చాలా బలంగా తాకింది. బంతిని అందుకోబోతుంటే రైట్ హ్యాండ్ ఫింగర్ కు తాకింది. వెంటనే ఆ బాల్ బౌండరీకి వెళ్లగా, దెబ్బ తాకిన కోహ్లీ వెంటనే నొప్పితో మోకాలి మీద కూర్చుండి పోయాడు. దీంతో తక్షణమే ఆర్సీబీ మెడికల్ స్టాఫ్ మైదానంలో వచ్చి విరాట్ కు ప్రాథమిక చికిత్స అందించింది. ఆ తరువాత కోహ్లీ ఫీల్డింగ్ కొనసాగించాడు. అయినప్పటికీ అతడు ఇబ్బంది పడుతున్నట్లుగానే కనిపించింది. దీంతో ఆర్‌సీబీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
కాగా.. కోహ్లీ Kohli గాయంపై ఆర్‌సీబీ (RCB) ఇంత వరకు ఎలాంటి ప్రకటన చెప్పలేదు. అయినప్పటికీ అతడికి రాబోయే 12 నుంచి 24 గంటలు కీలకం. గాయం తీవ్రమైనది అయితే అతడు తదుపరి మ్యాచ్ ఆడకపోవచ్చు. కోహ్లీ (Virat Kohli) త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్ధిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో (Virat Kohli) కోహ్లీ బ్యాటింగ్‌లో తేలిపోయాడు. 6 బంతుల్లో 7 పరుగులు చేసి అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ప్రసిద్ధ్ కృష్ణ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు.