అక్షర టుడే, వెబ్ డెస్క్ Virat Kohli : విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇండియన్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్నాడు. అతను క్రికెట్ ఆడటతోనే కాక యాడ్స్‌తోను బాగానే సంపాదిస్తున్నాడు. బ్రాండ్ ప్రమోషన్స్‌లో రారాజుగా వెలుగొందుతున్నాడు.
బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, Brand endorsements, promotions, ప్రమోషన్స్ ద్వారా కోట్లలో సంపాదిస్తుంటాడు కోహ్లీ virat kohli. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా చాలా కోట్లు ఆర్జించాడు. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నిండా అలాంటి బ్రాండ్ ప్రమోషన్స్‌కు సంబంధించిన పోస్ట్‌లు (Promotional Posts) ఎక్కువగా కనబడుతుంటాయి. అయితే కోట్లు తెచ్చిపెట్టే యాడ్స్, ప్రమోషనల్ పోస్ట్‌లను కోహ్లీ ఉన్నట్టుండి ఎందుకు తొలగించాడో తెలియక అందరు అవాక్కయ్యారు.
Virat Kohli : ప్లాన్ ఇది..
ప్రపంచవ్యాప్తంగా 271 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న కోహ్లీ (Virat Kohli) ఖాతాలో సాధారణంగా వ్యక్తిగత జీవితాన్ని, క్రికెట్ క్షణాలను, బ్రాండ్ ప్రమోషన్లను మిళితం చేస్తూ పోస్ట్‌లు ఉంటాయి. అయితే అందులో ప్రకటనల పోస్ట్‌లను ఫీడ్ నుండి తొలగించి, వాటిని Reels సెక్షన్‌కి తరలించినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఫీడ్ మరింత క్లీనుగా, అభిమానులకు సులభంగా అర్థమయ్యేలా ఉండేలా చూసినట్టు కనిపిస్తోంది. ఇది పూర్తిగా ఒక స్ట్రాటజిక్ సోషల్ మీడియా మూవ్ అనే చెప్పాలి. బ్రాండ్ ప్రమోషన్లు చేయడాన్ని కోహ్లీ మానలేదు. రానున్న రోజులలో కూడా కోహ్లీ బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా గట్టిగానే సంపాదించనున్నాడు.
ఇక విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తరఫున ఆడుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో రెండు మ్యాచ్ విన్నింగ్ అర్ధ సెంచరీలతో మెరిశాడు. మొత్తం 164 పరుగులు చేశాడు. ఇటీవల వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 42 బంతుల్లో 67 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఆ మ్యాచ్‌లో ముంబై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. డీసీతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచాడు. అతని బ్యాట్ నుండి పరుగులు రాకపోయే సరికి ఆర్సీబీకి విజయం వరించలేదు.