అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: విశాల్ మెగా మార్ట్ ఐపీవోకి రానుంది. దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ కలిగి ఉన్న విశాల్ మార్ట్ మార్కెట్ నుంచి రూ.8వేల కోట్లను సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఐపీవో ఈ నెల 11న ప్రారంభమై 13న ముగియనుంది. 16న షేర్లను అలాట్ చేస్తారు. షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.74 -రూ.78గా నిర్ణయించారు.