అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలంలోని కంజర్ లో ఓ వ్యక్తిని వియ్యంకుడు హతమార్చాడు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కంజర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ తన కూతురిని అదే గ్రామానికి చెందిన నరహరి కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు. కాగా.. ఇటీవల సత్యనారాయణ కూతురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. దీంతో తన కూతురుని నరహరే హత్య చేశాడని సత్యనారాయణ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి నరహరిని కట్టెలతో కొట్టి హతమార్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.