అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఊగిసలాట కొనసాగుతోంది. మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్దిసేపటికే నష్టాల బాట పట్టాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్టంగా 102 పాయింట్లు, నిఫ్టీ 26 పాయింట్లు పడిపోయాయి. ఆ తర్వాత సూచీలు క్రమంగా పుంజుకున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఫ్లాట్ గా కదలాడుతున్నాయి. నిఫ్టీ ఫిఫ్టీలో ఎల్టీఐఎం, ఇన్ఫోసిస్, విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్ ఒక శాతానికి పైగా లాభంతో ఉండగా అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిం ఒక శాతానికి పైగా నష్టంతో కొనసాగుతున్నాయి.