అక్షరటుడే, ఇందూరు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల(MLC elections) పోలింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్‌ను ప్రారంభించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పట్టభద్రుల ఓటర్లు 47,981 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 5,762 మంది ఉన్నారు. మొత్తం 135 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
Advertisement
Advertisement