అక్షరటుడే, వెబ్‌డెస్క్: Waaree Renewables | రెన్యువబుల్ ఎనర్జీ(Renewable energy) సెక్టార్‌కు చెందిన వారీ రెన్యువబుల్ టెక్నాలజీస్ అద్భుతమైన ఫలితాలు ప్రకటించింది. ఈ ఫలితాలు ఇన్వెస్టర్లలో కంపెనీపై నమ్మకాన్ని పెంచాయి. దీంతో గురువారం స్టాక్ ప్రైస్ పరుగులు తీస్తోంది.
Waaree Renewables | నికరలాభం(Net profit)..
వార్షిక నికర లాభం 83 శాతం(YOY) పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికరలాభం రూ. 51.31 కోట్లు కాగా.. 2024-25 లో ఇది రూ. 93.76 కోట్లకు చేరింది.
Waaree Renewables | రెవెన్యూ(Revenue)..
ఆదాయం కూడా 74 శాతం(YOY) వృద్ధి చెందింది. రూ. 273 కోట్లనుంచి రూ. 476 కోట్లకు పెరిగింది. EBITDA(ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్సెస్, డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్)
ఈబీఏటీడీఏ(EBITDA)లో సైతం 68 శాతం వృద్ధిని సాధించి రూ. 75 కోట్లనుంచి రూ. 126 కోట్లకు పెరిగింది.
Waaree Renewables | స్టాక్ పెర్ఫార్మన్స్(Stock performance)..
ఫలితాల ప్రకటన(post results) తర్వాత వారీ రెన్యువబుల్ టెక్నాలజీస్ Wari Renewable Technologies స్టాక్ ధర భారీగా పెరిగింది. ఉదయం 10.30 గంటల సమయంలో 12 శాతం లాభంతో రూ. 1,145 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 3,038 కాగా.. కనిష్ట ధర 732. ఐదేళ్లలో ఇన్వెస్టర్లకు 248 రెట్లు లాభాలు ఇచ్చిన ఈ కంపెనీ.. ఏడాది కాలంలో మాత్రం నష్టాలనే మిగిల్చింది.