Waqf Amendment Bill | అమల్లోకి వక్ఫ్ (సవరణ) చట్టం.. బిల్లు ఆమోదానికి ముందే కోర్టుకు వెళ్లిన కేంద్రం

Waqf Amendment Bill | అమల్లోకి వక్ఫ్ (సవరణ) చట్టం.. బిల్లు ఆమోదానికి ముందే కోర్టుకు వెళ్లిన కేంద్రం
Waqf Amendment Bill | అమల్లోకి వక్ఫ్ (సవరణ) చట్టం.. బిల్లు ఆమోదానికి ముందే కోర్టుకు వెళ్లిన కేంద్రం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Waqf Amendment Bill | పార్లమెంట్ Parliament ఇటీవల ఆమోదించిన వక్ఫ్(సవరణ) చట్టం-2025 మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం Central Government నోటిఫికేషన్ జారీ చేసింది. వక్ఫ్ చట్టానికి పలు సవరణలు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం Central Government పార్లమెంట్లో సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. లోక్సభ, రాజ్యసభల్లో Lok Sabha and Rajya Sabha బిల్లుపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నప్పటికీ, బిల్లు ఉభయ సభల ఆమోదం పొందింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము President Draupadi Murmu బిల్లుకు ఈ నెల 5వ తేదీన ఆమోదముద్ర వేయడంతో చట్టంగా మారింది. వక్ఫ్ సవరణ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

Advertisement

Waqf Amendment Bill | సుప్రీంకోర్టులో కేంద్రం కేవియట్?

పార్లమెంట్లో బిల్లు ఆమోదానికి ముందే కేంద్ర ప్రభుత్వం Central Government వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆదేశాలు జారీ చేయడానికి ముందే విచారణ జరపాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో కేవియట్ వేసినట్లు తెలిసింది. వక్ఫ్ సవరణ బిల్లును Waqf Amendment Bill రద్దు  చేయాలని కోరుతూ పదికి పైగా పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి. వక్ఫ్ బిల్లు Waqf Bill రాజ్యాంగబద్ధతను తేల్చాలని కోరుతూ కాంగ్రెస్, ఎంఐఎంతో Congress, AIMIM పాటు ముస్లిం పర్సనల్ లా బోర్డు Muslim Personal Law Board సహా ఇతరులు పిటిషన్లు దాఖలు చేశారు. ఏప్రిల్ 15న వీటిని న్యాయస్థానం విచారణకు చేపట్టే అవకాశముంది. అయితే, ఆలోపే కేంద్రం కేవియట్ దాఖలు చేసింది. తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని కోరింది.

ఇది కూడా చ‌ద‌వండి :  Waqf Amendment Bill | వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తాం

Waqf Amendment Bill | సుదీర్ఘ చర్చల అనంతరం ఆమోదం..

వక్ఫ్ సవరణ బిల్లుపై Waqf Amendment Bill ఉభయ సభల్లో సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లును విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది ముస్లిం వ్యతిరేక బిల్లు anti-Muslim bill అని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నాయి. అయితే, మైనార్టీ సమాజానికి minority community ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో తీసుకొచ్చిన చారిత్ర సంస్కరణ ఇది కేంద్రం సమర్థించుకుంది. రాజ్యసభలో 13 గంటలకు పైగా చర్చించిన అనంతరం ఆమోదముద్ర పడింది. అంతకు ముందు లోక్సభ కూడా బిల్లును ఆమోదించింది. బిల్లుకు 288 మంది మద్దతు తెలుపగా, 232 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లును కూడా పార్లమెంట్ ఆమోదించడంతో ముసల్మాన్ వక్ఫ్ చట్టం-1923 రద్దయింది.

Advertisement