అక్షరటుడే, వెబ్‌డెస్క్: Waqf Bill : శ్రీరామ నవమి పర్వదినాన రాముడి సన్నిధి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ముస్లిం మహిళలు అయోధ్య రాముడికి హారతి ఇచ్చారు. తర్వాత వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపారు. శ్రీరాముని దయ వల్లే వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించిందని అన్నారు.
వారణాసిలోని ముస్లిం ఉమెన్ ఫౌండేషన్ Muslim Women Foundation, విశాల్ భారత్ సంస్థాన్ Vishal Bharat Sansthan సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అందమైన రంగోలిని ఆవిష్కరించారు. కాగా, గత 19 సంవత్సరాలుగా వారణాసిలోని ముస్లిం మహిళలు శ్రీరామ నవమి రోజున శ్రీరాముడికి హారతి ఇస్తూ వస్తున్నారు.