Rahul Gandhi | వక్ఫ్ బిల్లు ముస్లింలపై దాడే.. రాహుల్​ గాంధీ ఆరోపణ

Rahul Gandhi | వక్ఫ్ బిల్లు ముస్లింలపై దాడే.. రాహుల్​ గాంధీ ఆరోపణ
Rahul Gandhi | వక్ఫ్ బిల్లు ముస్లింలపై దాడే.. రాహుల్​ గాంధీ ఆరోపణ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rahul Gandhi | వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు తీసుకు రావడమంటే ముస్లింలపై దాడి చేసినట్లేనని కాంగ్రెస్ అగ్రనేత, లోక్​సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ  Rahul Gandhi వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇతర వర్గాలను లక్ష్యంగా చేసుకోవడానికి తాజా బిల్లే ఒక ఉదాహరణ అని పేర్కొంటూ ‘ఎక్స్​’లో పోస్టు చేశారు. వక్ఫ్ బిల్లు Waqf Bill ఆమోదం పొందిన తర్వాత ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కాథలిక్ చర్చి భూములపై దృష్టి సారించిందన్న కథనాన్ని తన పోస్టుకు యాడ్ చేశారు.

Advertisement
Advertisement

Rahul Gandhi | రాజ్యాంగమే రక్షణ..

“వక్ఫ్ బిల్లు Waqf Bill ఇప్పుడు ముస్లింలపై దాడి చేస్తుందని చెప్పాను. కానీ భవిష్యత్తులో ఇతర వర్గాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని” రాహుల్​ గాంధీ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ RSS క్రైస్తవుల వైపు దృష్టి మరల్చడానికి ఎక్కువ సమయం పట్టదని తెలిపారు. ఇటువంటి దాడుల నుంచి మన ప్రజలను రక్షించే ఏకైక కవచం రాజ్యాంగం. దాన్ని రక్షించడం మన సమష్టి విధి అని పేర్కొన్నారు. మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కూడా కాథలిక్ చర్చి భూముల అంశాన్ని ప్రస్తావించారు. మొదట ఒక మైనారిటీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, అనంతరం మరొక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటుందని పేర్కొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Waqf Amendment Act | వక్ఫ్‌ సవరణ చట్టంలో ఏముందంటే..!