అక్షరటుడే, న్యూఢిల్లీ: Waqf Bill : లోక్ సభ ముందుకు నేడు వక్ఫ్ బిల్లు రానుంది. ఈ మేరకు తమ పార్లమెంటు సభ్యులకు భాజపా, కాంగ్రెస్ విప్ జారీ చేశాయి.
పార్లమెంటు సమావేశాలకు నేటి నుంచి మూడు రోజుల పాటు విధిగా హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేశాయి. బిల్లుపై మధ్యాహ్నం 12 గంటలకు చర్చ ప్రారంభం కానుంది. ఈ చర్చలో పాల్గొనాలని ఇండియా కూటమి తీర్మానం చేసింది.
వక్ఫ్ సవరణ బిల్లుపై 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ కొనసాగనుంది. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని ఇండియా కూటమి పార్టీల నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో బిల్లుపై ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.