అక్షర టుడే, వెబ్ డెస్క్ War 2 vs Coolie : స్టార్ సినిమాల మధ్య ఫైట్ ఆడియన్స్ కి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫెస్టివల్ సీజన్ లో స్టార్ సినిమాల మధ్య పోటీ తెలిసిందే. ఐతే ఇప్పుడు రాబోతున్న సినిమాల మధ్య ఫైట్ గురించి చూస్తే.. ఆగష్టు 14న స్టార్ హీరోల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది. అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కూలీతో హృతిక్ ఎన్ టీ ఆర్ కలిసి చేస్తున్న వార్ 2 (War 2 movie) ఫైట్ కి సిద్ధమైంది.
అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో హృతిక్ రోషన్, Hrithik Roshan, Tarak, తారక్ నటిస్తున్న వార్ 2 సినిమాపై (War 2 movie) భారీ అంచనాలు ఉన్నాయి. టీ సీరీస్ ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నారు. కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఇక ఈ సినిమాకు పోటీగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ పోటీకి దిగుతుంది.
War 2 vs Coolie : రజినీ లీడ్ రోల్ లో కూలీ..
లోకేష్ డైరెక్షన్ లో రజినీ (Rajinikanth) లీడ్ రోల్ లో వస్తున్న సినిమా కూలీ. ఈ సినిమాలో మన కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నాడు. కూలీ వర్సెస్ వార్ 2 (War 2 movie) మధ్య సూపర్ ఫైట్ జరగబోతుంది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రజినీ కూలీ వస్తుంది. ఈ సినిమా సూపర్ స్టార్ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుంది.
ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుంది. ఇక వార్ 2 (War 2 movie) యాక్షన్ ఎంటర్టైనర్ గా ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతుంది. రెండు సినిమాల కథలు వేరైనా రెండు కూడా యాక్షన్ ప్రియులను టార్గెట్ చేసుకునే వస్తున్నాయి. మరి ఈ ఫైట్ లో ఏ సినిమా సూపర్ హిట్ అవుతుంది.. ఏది ఎక్కువ ప్రేక్షకులను మెప్పిస్తుంది అన్నది చూడాలి. ఐతే ఈ రెండు డబ్బింగ్ సినిమాలు అవ్వడం తెలుగులో భారీ రిలీజ్ లు జరుగుతుండటం విశేషం. తప్పకుండా ఫ్యాన్స్ కి ఈ సినిమాలు మంచి ఫీస్ట్ ఇస్తాయేమో చూడాలి.