అక్షరటుడే వెబ్ డెస్క్ : మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లెక్సీవార్ నెలకొంది. దసరా సందర్భంగా వరంగల్ జిల్లా గ్రామంలో కొండా సురేఖ వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో ఎమ్మెల్యే రేపూరి ఫొటో లేకపోవడంతో ఆగ్రహించిన ఆయన వర్గీయులు ఫ్లెక్సీలను చించివేశారు. ఈక్రమంలో రేవూరి వర్గీయులపై దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి.