NIZAMABAD | విద్యార్థిని చితకబాదిన వార్డెన్
NIZAMABAD | విద్యార్థిని చితకబాదిన వార్డెన్
Advertisement

అక్షరటుడే, ఇందూరు: NIZAMABAD | జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని వార్డెన్ చితకబాదిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. నిర్మల్​కు చెందిన వాహజుద్దీన్ నిజామాబాద్ లోని ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్​ సెకండియర్​ అభ్యసిస్తున్నాడు. పరీక్షల నేపథ్యంలో చదవకుండా నిద్రపోతున్నాడనే నెపంతో ఫ్లోర్ ఇన్​ఛార్జి కొట్టినట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు కళాశాలకు చేరుకొని ప్రిన్సిపాల్​ను నిలదీసినట్లు తెలిసింది. కళాశాల ప్రతినిధులను వివరణ కోరగా విద్యార్థి అనుచిత ప్రవర్తనతో మందలించడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే విద్యార్థి సంబంధీకులు రూరల్ పోలీస్​ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పటికీ.. తమకు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వకపోవడంతో కేసు నమోదు చేయలేదని రూరల్ ఎస్సై తెలిపారు.

Advertisement