అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చే సమయంలో రేషన్‌ కార్డు ఆధారంగా ఇచ్చారా? రుణమాఫీకి రేషన్‌ కార్డు లింకు పెట్టడమేందుకు? అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తామని, రైతుబంధు పెంచి ఇస్తామని చేసిన వాగ్దానాలను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎగ్గొటిందని ఆయన విమర్శించారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రైతులకు రైతుబంధు రాదు, రుణమాఫీ పూర్తి కాదు, బోనస్‌ బోగస్‌ అయిపాయే’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని, కొత్త ప్రాజెక్టులు నిర్మించడంలేదన్నారు. 420 హామీల అమలు చేతకాక రోజుకో డ్రామా ఆడుతున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు.