అక్షరటుడే, ఇందూరు: Bar Association | బార్ అసోసియేషన్‌కు సీనియర్ న్యాయవాది జేవీఆర్ బాబు (JVR BABU) వాటర్ డిస్పెన్సర్స్ అందజేశారు. అసోసియేషన్ కార్యాలయంలో వీటిని బుధవారం జిల్లా జడ్జి సునీత కుంచాల(JUDGE SUNITHA KUNCHALA) ప్రారంభించారు.
ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. వేసవి(SUMMAR)లో కక్షిదారుల కోసం వీటిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, చార్టెడ్ అకౌంటెంట్ సవిత, సీనియర్ న్యాయవాదులు జగదీశ్వరరావు, కృపాకర్ రెడ్డి, కిరణ్ కుమార్ గౌడ్, రాజలింగం, రాజకుమార్ సుబేదార్ తదితరులు పాల్గొన్నారు.