అక్షరటుడే, ఆర్మూర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో పెరిగింది. ప్రస్తుతం జలాశయంలోకి 75,881 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నిండు కుండలా ఉండడంతో 16 గేట్లు, వివిధ కాల్వల ద్వారా అంతే స్థాయిలో దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా 1090.90 అడుగులు (80.053 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

Advertisement
Advertisement
Advertisement