అక్షరటుడే, జుక్కల్ : నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. జలాశయంలోకి ఇన్ ఫ్లో పెరగడంతో శుక్రవారం ఉదయం నుంచి నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 20వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో నాలుగు వరద గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని మంజీరలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1404.64 అడుగుల (17.28 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ఏఈ శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.