అక్షరటుడే, ఆర్మూర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. 1091 అడుగుల(80.501 టీఎంసీలు) నీటిమట్టంతో నిండుకుండలా ఉంది. ప్రాజెక్టులోకి 15,702 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా అంతే మొత్తంలో ప్రాజెక్టు రెండు వరద గేట్లను ఎత్తి గోదావరి నదిలోకి నీటిని వదులుతున్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యాం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు.