అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. జలాశయంలోకి 30వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండడంతో ఐదు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు(17.80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1404.52 అడుగుల(17.802 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ఏఈ శివప్రసాద్ తెలిపారు.
సింగూరు నుంచి..
నిజాంసాగర్ ఎగువన గల సింగూరు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 12,633 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వచ్చి చేరుతుండగా.. 19,740 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 523.600 మీటర్లు (29.917 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 523.420 మీటర్లు (28.885 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.