అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pakistan Army Chief | హిందువులకు భిన్నంగా మన జీవితాలు ఉంటాయని, మన ఆలోచనలు, ఆశయాలు వారికంటే భిన్నంగా ఉంటాయని, అక్కడే పాకిస్తాన్ ఏర్పాటుకు పునాది పడిందని ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్(Army Chief General Asim Munir) వ్యాఖ్యానించారు. రెండు దేశాల సిద్ధాంతాన్ని ఎత్తిచూపిన ఆయన.. పాకిస్తాన్ పౌరులు తమ పిల్లలకు పాక్ పుట్టుక గురించి వివరించాలన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఓవర్సీస్ పాకిస్తానీ కన్వెన్షన్(Overseas Pakistani Convention)లో ప్రసంగించిన అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్(Pakistan)కు చెందిన మునుపటి తరాలు దేశాన్ని సృష్టించడానికి, నిలబెట్టడానికి నిరంతరం పోరాడుతున్నాయన్నారు. “… మన పూర్వీకులు జీవితంలోని ప్రతి అంశంలోనూ మనం హిందువుల నుంచి భిన్నంగా ఉన్నామని భావించారని” మునీర్(Munir) అన్నారు. “మన మతం భిన్నంగా ఉంటుంది, ఆచారాలు భిన్నంగా ఉంటాయి. మా సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి, ఆలోచనలు భిన్నంగా ఉంటాయి, మా ఆశయాలు భిన్నంగా ఉంటాయి. అక్కడే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది పడింది. మేము రెండు దేశాలు, మేము ఒకే దేశం కాదని” ఆయన పేర్కొన్నారు.
Pakistan Army Chief | త్యాగాలతోనే..
మా పూర్వీకులు చేసిన అపారమైన త్యాగాలతోనే పాకిస్తాన్(Pakistan) పురుడు పోసుకుందని మునీర్ తెలిపారు. “మా పూర్వీకులు అపారమైన త్యాగాలు చేశారు ఈ దేశ సృష్టి కోసం మేము చాలా త్యాగం చేశాము. దేశాన్ని ఎలా రక్షించాలో మాకు తెలుసు” అని ఆయన అన్నారు. ఎన్నో త్యాగాలతో ఏర్పడిన పాకిస్తాన్ కథ గురించి మీ పిల్లలకు వివరించండని సూచించారు. తద్వారా పాకిస్తాన్‌తో వారి బంధం ఎప్పుడూ బలహీనపడదు. అది మూడవ తరం అయినా, నాల్గవ తరం అయినా, ఐదవ తరం అయినా, వారికి పాకిస్తాన్ ఏమిటో తెలుస్తుందని” చెప్పారు. బలూచిస్తాన్(Balochistan)లో ఉగ్రవాదులను అణిచివేస్తామని కూడా ఆయన ప్రతిజ్ఞ చేశారు, “పది తరాల ఉగ్రవాదులు కూడా బలూచిస్తాన్ మరియు పాకిస్తాన్‌కు హాని చేయలేరు” అని పేర్కొన్నారు.