అక్షరటుడే, ఇందూరు: degree college | జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలను practical examinations బహిష్కరిస్తున్నామని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల Private Degree Colleges యాజమాన్యాల సంఘం జిల్లా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంబోజి హరిప్రసాద్, సంజీవరెడ్డి పేర్కొన్నారు. శనివారం వారు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..డిగ్రీ కళాశాలల్లో degree colleges ఫీజు రీయింబర్స్మెంట్ fee reimbursement విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి state government అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో జాప్యం కారణంగా కళాశాలల అద్దెల కూడా చెల్లంచలేక కళాశాలలు అవస్థలు పడుతున్నాయన్నారు. లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని వారు వాపోయారు. ప్రభుత్వం కళాశాలల గోడును పట్టించుకోనందుకు నిరసనగా ఈనెల 16వ తేదీ నుంచి జరగబోయే ప్రాక్టికల్స్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
degree college | డిగ్రీ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరిస్తున్నాం
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement