అక్షరటుడే, కామారెడ్డి: Bhu Bharathi | రాష్ట్ర ప్రభుత్వం ‘ధరణి(Dharani)’ స్థానంలో ‘భూభారతి’ తీసుకొచ్చిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector ashish sangwan) అన్నారు. గురువారం ఆయన పాల్వంచ, మాచారెడ్డి మండలాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూభారతి(Bhi Barathi)లో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డుల్లో తప్పులు సవరణ చేసుకోవచ్చని వివరించారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్(mutation) చేయడానికి ముందు భూముల సర్వే, పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరిస్తామని చెప్పారు.
భూ యజమానులకు ఎలాంటి అభ్యంతరాలున్నా తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. భూదార్ కార్డుల జారీ(Issuance of Bhudar cards), రైతులకు ఉచిత న్యాయ సాయం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వీణ, మండల ప్రత్యేకాధికారులు శ్రీపతి, సురేష్, తహశీల్దార్లు హిమబిందు, శ్వేత, ఎంపీడీవోలు శ్రీనివాస్, గోపిబాబు పాల్గొన్నారు.