అక్షరటుడే వెబ్‌డెస్క్: CM Revanth Reddy | గత ప్రభుత్వం previous government పదేళ్లలో చేయలేని పనులను తాము 10 నెలల్లో చేసి చూపించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతి Ravindra Bharathiలో గురువారం నిర్వహించిన కొలువుల పండుగ Koluvula festival కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్లో పోస్టులకు ఎంపికైన 922 మందికి ఉద్యోగ నియామక పత్రాలు Job appointment letters అందజేశారు. అలాగే బిల్డ్ నౌ పోర్టల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ CM Revanth మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశించారన్నారు. కానీ గత పాలకులు పదేళ్లుగా ఈ నియామకాలు చేపట్టలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలు నేరవేర్చలేకపోయిందన్నారు. తాము 10 నెలల్లో చేసిన పనులను పదేళ్లలో ఎందుకు చేయలేకపోయారని సీఎం ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఎన్ని నియామకాలు చేపట్టిందని.. ఎన్ని పరీక్షలు సజావుగా నిర్వహించిందని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వ హయాంలో అయినా నోటిఫికేషన్లు notifications ఇవ్వాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తారని.. కానీ తమ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఎక్కువగా ఇవ్వడంతో జర ఆపండి అంటూ అభ్యర్థులు ధర్నాలు చేశారని వివరించారు.
CM Revanth Reddy | పదేళ్లలో చేయలేని పనులు 10 నెలల్లో చేశాం
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి :పీఎం కిసాన్ లబ్ధిదారుల స్టేటస్.. జాబితాలో మీ పేరు లేకపోతే ఏం చేయాలి ?
Advertisement