అక్షరటుడే, ఇందూరు: CP Sai Chaitanya | జిల్లాలో తలసేమియా(thalassemia) పిల్లల కోసం రక్తదాన శిబిరాల(blood donation camps) ఏర్పాటుకు సహకరిస్తామని సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. జిల్లా రెడ్‌క్రాస్(Red Cross) ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు ఆధ్వర్యంలో సభ్యులు సీపీని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రెడ్‌క్రాస్(Red Cross) ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను వారు వివరించారు. కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కార్యదర్శి అరుణ్‌బాబు, నిజామాబాద్ డివిజన్ ఛైర్మన్ శ్రీశైలం, రాజేశ్వర్, పీఆర్వో బొద్దుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.