అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | పోలీస్ కమిషనరేట్(Police Commissionerate) పరిధిలో వీడీసీ(VDC)ల అక్రమ కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణిచేస్తామని సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనే సదుద్దేశంతో 15ఏళ్ల క్రితం జిల్లాలో ఏర్పడిన గ్రామాభివృద్ధి కమిటీలు తదనంతరం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు.
కాలక్రమేణా ఈ కమిటీలు అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా సివిల్ పంచాయతీలు(Civil Panchayat) పరిష్కరించడం, భూ తగాదాలు(Land disputes), వివాహ సంబంధ తగాదాలు(marital disputes), భార్యభర్తల కొట్లాల్లో తలదూర్చి ఇబ్బందులు పెడుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. వీడీసీ(VDC)లు తాము చెప్పిన మాట వినకపోతే కుల, గ్రామ బహిష్కరణలు చేయడం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనన్నారు.
CP Sai Chaitanya | వేలంపాటలు నిర్వహిస్తే కఠిన చర్యలు
గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో బెల్ట్(Belt), కూల్డ్రింక్(Cooldrink), కిరాణా షాపుల(Kirana Shops)పై వేలం పాటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ(CP) స్పష్టం చేశారు. గ్రామాల్లో పంచాయతీలు పెట్టి ఇరువర్గాల నుంచి డబ్బులు వసూలు చేయడం చట్టవ్యతిరేకమన్నారు. పోలీసులను ఆశ్రయించే వారిపై వీడీసీ(VDC)లు కఠినంగా వ్యవహరిస్తున్నాయని.. ఇది సరైంది కాదన్నారు.
CP Sai Chaitanya | ఎంతటివారైనా వదిలిపెట్టం..
కమిషనరేట్(Commissionerate) పరిధిలోని గ్రామాల్లో వీడీసీ(VDC)లు వేధిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ(CP) సూచించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. వారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.