అక్షరటుడే, వెబ్డెస్క్: China | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ US President Donald Trump తెరలేపిన వాణిజ్య యుద్ధానికి తగిన బదులిస్తామని చైనా China స్పష్టం చేసింది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని తగిన విధంగా బదులిచ్చేందుకు తమ వద్ద అన్ని ఆయుధాలు ఉన్నాయని తెలిపింది.
చైనా నుంచి దిగుమతయ్యే అన్ని ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 104 శాతం టారిఫ్‌లు tariffs విధించడంపై డ్రాగన్ ప్రభుత్వం తాజాగా స్పందించింది. సుంకాల పేరుతో అమెరికా ప్రపంచ దేశాలను బ్లాక్‌మెయిల్ america blackmailing చేస్తుందని చైనా ప్రీమియర్ లీ కియాండ్ విమర్శించారు.
China | వృద్ధిలో ముందడుగే..
ట్రంప్ తాజా సుంకాలు విధించినప్పటికీ, 2025లో ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వృద్ధి second-largest economy కొనసాగుతుందని లీ కియాంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా సుంకాలకు భయపడబోమని స్పష్టం చేశారు. సుంకాల పేరుతో బ్లాక్‌మెయిల్‌కు blackmail పాల్పడుతున్నారని, దీనిపై తాము చివరి వరకు పోరాడతామని తెలిపారు.
ఇందుకోసం తగిన ఆర్థిక విధానాలు economic policies రూపొందించామన్నారు. వాణిజ్య భాగస్వాములందరిపైనా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమెరికా ఏకపక్ష వాదం, రక్షణవాదం, ఆర్థికంగా బలవంతపు చర్యలకు అద్దం పడుతున్నాయని విమర్శించారు. దీనికి తాము తప్పకుండా స్పందిస్తామన్నారు. సొంత ప్రయోజనాల కోసమే కాదని, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు కాపాడేందుకు పోరాడతామని చెప్పారు.