అక్షరటుడే, ఇందూరు: Waqf Amendment Bill | వక్ఫ్ చట్టానికి తాము వ్యతిరేకమని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని సియాసత్ ఎడిటర్, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ (MLC Aamir Ali Khan) తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి హోటల్(Nikhil Sai Hotel)లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ(MLC) మాట్లాడుతూ.. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల్లో చైతన్యం తెస్తున్నామన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో బైక్ ర్యాలీలు(Bike Rally) నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు తర్వాత పూర్తిస్థాయి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు