అక్షరటుడే, ఇందూరు:MLA Sudarshan Reddy | జిల్లా గ్రంథాలయంలో తొందర్లోనే భోజన సదుపాయం కల్పిస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy) తెలిపారు. ఇటీవల ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ(Digital Library)ని గురువారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు(Students Bright Future) కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
విద్యార్థులకు(Students) ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని గ్రంథాలయ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్, నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విజయపాల్ రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.