అక్షరటుడే, ఇందూరు: TGNPDCL NIZAMABAD | జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరిస్తామని టీజీఎన్పీడీసీఎల్ వినియోగదారుల ఛైర్మన్ నారాయణ పేర్కొన్నారు. నగరంలోని పవర్‌హౌజ్‌లో టౌన్-1 సబ్‌డివిజన్ పరిధిలో సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వర్ని చౌరస్తాలో ఇనుప స్తంభం కారణంగా ఇబ్బందులు వస్తున్నాయని, తక్షణమే మార్చాలని వినియోగదారులు కృపాల్‌సింగ్, రామకృష్ణ కోరారు. వెంటనే సమస్య పరిష్కరించాలని ఛైర్మన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వినియోగదారుల పరిష్కార వేదిక టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, కిషన్, రాజారెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్ డీఈ శ్రీనివాస్, ఏడీఈ టౌన్–1 చంద్రశేఖర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ మంగ్యానాయక్, ఏఈ డీ–1 నగేశ్ తదితరులు పాల్గొన్నారు.