Stock market | సుంకాల సునామీలో ఇన్వెస్టర్ల సంపద గల్లంతు.. రూ. లక్షల కోట్ల డాలర్లు ఆవిరి

Stock market | సుంకాల సునామీలో ఇన్వెస్టర్ల సంపద గల్లంతు.. రూ. లక్షల కోట్ల డాలర్లు ఆవిరి
Stock market | సుంకాల సునామీలో ఇన్వెస్టర్ల సంపద గల్లంతు.. రూ. లక్షల కోట్ల డాలర్లు ఆవిరి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock market | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన రెసిప్రోకల్‌ టారిఫ్స్‌ స్టాక్‌ మార్కెట్‌(Stock market) ఇన్వెస్టర్లపైనే ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. ట్రేడ్‌ వార్‌లో రెండు రోజుల్లోనే లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైపోయింది. ఇందులో అమెరికన్‌ మదుపరులే ఎక్కువగా నష్టపోయారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటినుంచి టారిఫ్‌(Tariff) విషయంలో పూటకోమాట మాట్లాడుతూ వస్తున్నారు. దీని ప్రభావం ఎక్కువగా స్టాక్‌ మార్కెట్లపై కనిపిస్తోంది. దీంతో మూడు నెలల కాలంలో రెండు మూడు దేశాల స్టాక్‌ మార్కెట్లు మినహా అన్ని దేశాల మార్కెట్లు నష్టపోయాయి. ప్రధానంగా టారిఫ్‌లు ప్రకటించిన తర్వాత స్టాక్‌ మార్కెట్లలో సునామీ వచ్చింది. అమెరికా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. యూఎస్‌(US) ఇన్వెస్టర్లు రెండు రోజుల్లోనే 5 లక్షల కోట్ల డాలర్ల సంపద కోల్పోయారు. ఇది మన దేశ (Bharath) కరెన్సీలోకి మారిస్తే రూ. 425 లక్షల కోట్లవుతుంది. కోవిడ్‌ తర్వాత ఇంత భారీ మొత్తంలో అమెరికా ఇన్వెస్టర్లు నష్టపోవడం ఇదే తొలిసారి. కోవిడ్‌ సమయంలో యూఎస్‌ మార్కెట్లు 3.3 లక్షల కోట్ల డాలర్లు కోల్పోయాయి.

Advertisement
Advertisement

Stock market | మన మార్కెట్ల పనితీరు

ట్రంప్‌ సుంకాలు ప్రకటించిన రోజు తక్కువ నష్టాలతో బయటపడిన మన ఇండెక్స్​లు.. ఆర్థిక మాంద్యం భయాలతో మరుసటి రోజు మాత్రం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌(Sensex) రెండు రోజుల వ్యవధిలో 1,248 పాయింట్లు నష్టపోయింది. ఈ ఏడాది జనవరినుంచి ఇప్పటివరకు 4 శాతానికిపైగా తగ్గింది. కాగా రెండు రోజుల వ్యవధిలో 426 పాయింట్లు తగ్గిన నిఫ్టీ.. ఈ ఏడాదిలో 3.5 శాతం నష్టపోయింది.

Stock market | మిక్స్‌డ్‌గా స్పందించిన ఆసియా(Asia) మార్కెట్లు

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లోనూ కొన్ని దేశాల స్టాక్‌ మార్కెట్లు ఇన్వెస్టర్లకు లాభాలను అందించాయి. ప్రధానంగా హాంగ్‌కాంగ్‌కు చెందిన హంగ్‌సెంగ్‌ ఈ ఏడాది ఇప్పటివరకు 16.44 శాతం రిటర్న్స్‌ ఇవ్వగా.. దక్షిణ కొరియాకు చెందిన కోప్సి 2.60 శాతం, చైనాకు చెందిన శాంఘై 2.44 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రేయిట్‌ టైమ్స్‌ 0.85శాతం లాభాలను ఇచ్చాయి. జపాన్‌కు చెందిన నిక్కీ మాత్రం 14 శాతం, తైవాన్‌ స్టాక్‌ మార్కెట్‌ 6.72 శాతం నష్టపోయాయి. అయితే టారిఫ్‌ల ప్రకటనల తర్వాత మాత్రం అన్ని మార్కెట్లు నష్టపోయాయి. తైవాన్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ 4 శాతానికిపైగా నష్టపోగా హంగ్‌సెంగ్‌, స్ట్రెయిట్‌ టైమ్స్‌, నిక్కీ 3 శాతం వరకు, కోప్సి ఒక శాతం పడిపోయాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Stock market | తీవ్ర ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు

stock market | యూరోప్‌లోనూ..

టారిఫ్‌ల ప్రకటన తర్వాత యూరోప్‌కు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ, డీఏఎక్స్‌లు 6.5 శాతం పడిపోయాయి. సీఏసీ 6 శాతం నష్టపోయింది.

stock market | యూఎస్‌ మార్కెట్లపై అధిక ప్రభావం

ట్రేడ్‌ వార్‌(Trade war)లో అమెరికా స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ట్రంప్‌ 180 దేశాలపై సుంకాలు ప్రకటించగా.. కొన్ని దేశాలు దీటుగా స్పందిస్తున్నాయి. కెనెడా, చైనా వంటి దేశాలు తిరిగి సుంకాలు విధించాయి. దీంతో శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు కుప్పకూలాయి. రెండు రోజుల వ్యవధిలోనే(గురు, శుక్రవారాలు) నాస్‌డాక్‌ 1,931 పాయింట్లు కోల్పోయింది. ఈ ఏడాది ప్రారంభంనుంచి ఇప్పటివరకు 19.18 శాతం పడిపోవడం గమనార్హం.

ఎస్‌అండ్‌పీ సైతం భారీగానే పడిపోయింది. గురు, శుక్రవారాల్లో కలిపి 570 పాయింట్లు పడిపోయిన ఎస్‌అండ్‌పీ.. ఈ ఏడాది జనవరినుంచి ఇప్పటివరకు 13.73 శాతం నష్టపోయింది.

రెండు రోజుల్లో 3,853 పాయింట్లు కోల్పోయిన డౌజోన్స్‌.. ఈ ఏడాది ఇప్పటివరకు 9.94 శాతం తగ్గింది. ట్రంప్‌ టారిఫ్‌లు బూమరాంగ్‌గా మారి ఆ దేశ సంపదనే హరించి వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Advertisement