అక్షరటుడే, ఇందూరు: India Space Week | ఇండియా స్పేస్ వీక్ సందర్భంగా ఈనెల 19న ఆన్లైన్ వెబినార్(Online webinar) నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్ తెలిపారు. దేశంలో మొదటి ఉపగ్రహాన్ని ఆర్యభట్ట(Satellite Aryabhatta) ప్రయోగించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈనెల 17లోపు www.aryabhata.indiaspaceweek.org వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. వెబినార్లో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి, అవగాహన కల్పిస్తామని చెప్పారు.