
అక్షరటుడే, వెబ్డెస్క్: Metro Driver and Loco Pilot | మెట్రో రైలు డ్రైవర్ అంటే తెలుసు కదా. నగరాల్లో ఉండే మెట్రో రైళ్లను నడిపే వాళ్లను మెట్రో డ్రైవర్ లేదా ట్రెయిన్ ఆపరేటర్ అని అంటారు. అదే ట్రాక్స్ మీద నడిచే ట్రెయిన్లను నడిపే వాళ్లను లోక్ పైలెట్ అంటారు. భారతదేశంలో రైల్వే మీద ఆధారపడి చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు. అసలు లోక్ పైలెట్ కానీ, ట్రెయిన్ ఆపరేటర్ కానీ కావాలంటే ఏం చేయాలి? వాళ్లను ఎలా రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ల జీతాలు ఎలా ఉంటాయి? ఎవరి జీతం ఎక్కువ ఉంటుంది. అనే విషయాలు తెలుసుకుందాం రండి.
మెట్రో డ్రైవర్ అవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. టెక్నికల్ ఫీల్డ్ లో ఆసక్తి ఉన్నవాళ్లు ఈ రంగంలో రాణించవచ్చు. మెట్రో డ్రైవర్ బాధ్యత కూడా పెద్దదే. కొన్ని వేల మంది ప్యాసెంజర్లను సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేర్చడం అనేది పెద్ద బాధ్యతే అవుతుంది. ఐటీఐ, లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా చేసినా చాలు. మెట్రో డ్రైవర్ గా ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది. మంచి ఆరోగ్యం, కళ్లు సరిగ్గా కనిపించాలి. ఐసైట్ ఉండకూడదు. 18 నుంచి 28 ఏళ్ల వయసు మధ్య ఉన్న వాళ్లు ఈ ఉద్యోగానికి అర్హులు.
Metro Driver and Loco Pilot : మెట్రో డ్రైవర్, లోకో పైలెట్ మధ్య తేడా ఏంటి?
లోకో పైలెట్ కంటే మెట్రో డ్రైవర్ జీతం ఎక్కువగా ఉంటుంది. ఢిల్లీ లాంటి మెట్రోలో మెట్రో డ్రైవర్ ప్రారంభ వేతనమే రూ.39 వేలు ఉంటుంది. అనుభవం పెరుగుతున్నా కొద్ది అది రూ.91 వేల వరకు పెరిగే చాన్స్ ఉంటుంది. అదే లోకో పైలెట్ జీతం రూ.30 వేల నుంచి 35 వేల వరకు ఉంటుంది. మెట్రో డ్రైవర్ గా జాబ్ కావాలనుకుంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న మెట్రో రైల్ కార్పొరేషన్ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లోక్ పైలెట్ కావాలంటే ఆర్ఆర్బీ పరీక్షలు నిర్వహించినప్పుడు రాయాల్సి ఉంటుంది.