అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ఏపీలోని కాకినాడలోని యాంకరేజ్ పోర్టు నుంచి భారీగా రేషన్ బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని..? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు వచ్చి అక్రమ రవాణాలను ఆపితేగానీ.. చర్యలు చేపట్టారా అని ప్రశ్నించారు. బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో కాకినాడ పోర్టులో శుక్రవారం ఆయన తనిఖీలు చేపట్టారు. మంత్రి నాందెడ్ల మనోహర్‌తో కలిసి బోటులో సముద్రం లోపలికి వెళ్లి పరిశీలించారు. బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని డీఎస్పీ రఘువీర్ విష్ణువు, ఎమ్మెల్యే కొండబాబును నిలదీశారు. దీనివెనుక ఎంతటివారున్నా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.