అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | బడ్జెట్లో ఆరు గ్యారెంటీలకు నిధులేవి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రశ్నించారు. బడ్జెట్(budget) అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్(assembly media point) వద్ద మాట్లాడారు. బడ్జెట్(budget) ప్రసంగం అనంతరం ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు పాతర వేసిందని తమకు అర్థం అయిందన్నారు. బడ్జెట్(budget)లో నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు. మహిళలకు రూ.2500 హామీ, పెన్షన్(pension) పెంపు గురించి ప్రస్తవించకపోడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీ గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదన్నారు. కరోనా వైరస్(coronavirus) కంటే కాంగ్రెస్(Congress) ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. ఉన్న గురుకులాలను సక్రమంగా నడపాలేని కాంగ్రెస్ కొత్తగా స్కూల్స్ మంజూరు చేస్తామనడం హాస్యాస్పదమన్నారు.
KTR | బడ్జెట్‌పై కేటీఆర్ రియాక్షన్ ఇదే..
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి :పీఎం కిసాన్ లబ్ధిదారుల స్టేటస్.. జాబితాలో మీ పేరు లేకపోతే ఏం చేయాలి ?
Advertisement