Balli Sastram : మీ ఇంట్లో బల్లులు కొట్టుకుంటూ కనిపించాయా.. ఇలా జరిగితే అరిష్టమా.. బల్లి శాస్త్రం ఏంచేబుతుంది..?

Balli Sastram : మీ ఇంట్లో బల్లులు కొట్టుకుంటూ కనిపించాయా.. ఇలా జరిగితే అరిష్టమా.. బల్లి శాస్త్రం ఏంచేబుతుంది..?
Balli Sastram : మీ ఇంట్లో బల్లులు కొట్టుకుంటూ కనిపించాయా.. ఇలా జరిగితే అరిష్టమా.. బల్లి శాస్త్రం ఏంచేబుతుంది..?

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Balli Sastram : మన ఇంట్లో గోడలపై బల్లులు తిరగడం ,మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. అయితే మన ఇంట్లోకి బల్లి ప్రవేశించడానికి కొన్ని కారణాలు ఉంటాయని, వాటి వల్ల కొన్ని సంకేతాలు మనకి తెలియజేస్తాయని. జ్యోతిష్యశాస్త్రంలో తెలుపబడింది. ఇంట్లోకి ఒక బల్లి వచ్చిందంటే తరువాత ఎన్నో బల్లులు వస్తూ ఉంటాయి. శాస్త్రం ప్రకారం ఇంట్లోకి బల్లులు ప్రవేశిస్తే శుభ సూచకమని తెలియజేస్తుంది. భవిష్యత్తులో ఒక గొప్ప శుభ ఘటం జరగబోతుందని కూడా సూచిస్తుంది. బల్లులు ఇంట్లో కనబడడం వల్ల మనకు అరిష్టమా లేదా ప్రయోజనాలు కలుగుతాయా అనే విషయం తెలుసుకుందాం…

Advertisement
Advertisement

బల్లులు ఇంట్లో కనిపిస్తే : బల్లులు ఇంట్లో కనిపించడం,దానిని చూసి మనం భయపడడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు బల్లులు మ‌న‌ మీద కూడా పడుతూ ఉంటాయి. అలా పడితే ఏదో చెడు జరిగిందని భయపడిపోతుంటాం. శాస్త్రంలో బల్లి శరీరంపై ఎక్కడపడితే ఎటువంటి సంకేతాలు తెలియజేస్తుంది అనేది, బల్లి శాస్త్రంలో తెలుపబడింది. ఇంట్లో బల్లులు కనపడిన వాటి వల్ల కూడా మనకి కొన్ని సంకేతాలు తెలియజేస్తాయి అని, బల్లి శాస్త్రంలో తెలుపబడింది. బల్లులు ఒంటిమీద పడటం నుంచి కంటికి కనిపించడం వరకు ప్రతి చర్య ఏదో ఒక కారణం ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయం పట్ల మీరు తేలిగ్గా తీసుకుంటే,ఈ అంశం వెనుకున్న విషయం ఏమిటో తెలుసుకోవాలి…

ఇంట్లో గోడపై ఒకటి కంటే ఎక్కువ బల్లి పిల్లలను గనుక మీరు చూసినట్లయితే, అది మంచి శుభసంకేతకం. ఇంట్లో గోడలపై మగ ఆడ బల్లులు చేరితే భార్య భర్తల ఐక్యత బలపడుతుందని సంకేతం. ఇంకా, దీపావళి పండుగ రోజు ఇంట్లో బల్లి కనిపిస్తే చాలా శుభం కలుగుతుందని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రంలో బల్లి గురించి చెప్పబడింది. అయితే, బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి, బల్లిని చూసిన ప్రతిసారి మీ ఆర్థిక సమస్యలు కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతున్నట్లు సంకేతం. దినిని బట్టి, బల్లి ఇంట్లో కనబడితే శుభ సూచకం.

బల్లి శాస్త్రం ఏం చెబుతుంది : ఇంట్లో కనబడితే వాటిని చూస్తే భయపడి పోతారు. జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం, ఇంట్లో బల్లిని చూడటం కొన్ని ప్రత్యేక సంకేతాలకు నమ్మవచ్చు అని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఇంట్లోకి బల్లి వస్తే అది శుభమా లేక అశుభమా.. అసలు ఏ సంకేతం కనబరుస్తుందో తెలుసుకుందాం…

మీ ఇంట్లో బల్లి కనబడితే ఏం జరుగుతుంది : బ‌ల్లి శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో గోడలపై బల్లిని గనక చూసినట్లయితే మీ జీవితంలో కొత్తగా ఏదో జరగబోతుందని అర్థం. ఇంట్లో బల్లి ని చూస్తే సంపదకు,శ్రేయస్సుకు సంకేతం అని అర్థం. అయితే, ఇంటి పూజ గదిలో బల్లిని చూసినట్లయితే అది ఎంతో శుభప్రధాన్ని కలుగజేస్తుందని బల్లి శాస్త్రంలో పరిగణించబడింది.

మీరు నూతన గృహంలోకి అడుగుపెట్టేటప్పుడు, మీకు బల్లి రావడం కనిపించినట్లయితే పూర్వీకుల రాకకు సంకేతంగా భావించవచ్చు. ఇంటి పైకప్పు నుంచి బల్లి కింద పడినట్లుగా కనిపిస్తే అది కూడా శుభసంకేతం గానే పరిగణించబడింది. దిని వలన ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. బాత్రూంలో బల్లి ని చూడటం కూడా శుభసంకేతకంగా పరిగణించబడుతుంది. ఇలా చూడడం మీకు భవిష్యత్తులో ఇబ్బందులు అన్ని తొలగిపోయి సంపదలను పొందే అవకాశాలను సూచిస్తుంది.

మీ ఇంట్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ బల్లులు పోట్లాడుకోవడం చూడడం అశుభంగా పరిగణించబడుతుంది. ఇలా జరిగితే మీ ఇంట్లో విభేదాలు ఇంకా గొడవలు జరిగే ప్రమాదాలను సూచిస్తుందని అర్థం. కొన్ని బల్లులు నల్లగా ఉంటాయి. అటువంటి బల్లులు మీ ఇంట్లో మీరు చూసినట్లయితే అసంతృప్తికి సంకేతంగా పరిగణించడంజరిగింది. ఇది ఆర్థికంగా నష్టం పోయేలా చేస్తుందని సంకేతం.తోక‌లేని బల్లి ఇంట్లోకి ప్రవేశిస్తే అది అశుభమని భావిస్తారు. శత్రువులు మీపై విజయం సాధిస్తారని సూచిస్తుంది.

బాత్రూంలో స్నానం చేసేటప్పుడు బాత్రూం గోడలపై ఉన్న బల్లులు గనుక మీ ఒంటిపై ప‌డినా కానీ ,ఆ నీటిలో కానీ పడినట్లయితే అది అశుభసంకేతంగా సూచిస్తారు.ఆ నీటితో స్నానం చేయకూడదు. మళ్లీ మీ ఒంటి పైన పడితే వెంటనే స్నానం చేయాలి. స్నానం చేసి వెంటనే పూజ గదిలోకి వెళ్లి దేవునికి నమస్కరించి దేవుడు ఫోటోలని ముట్టుకోవాలి. మన పూర్వీకులు ఇలా చేసేవారు. బల్లి సరాసరి శిరసుపై పడితే అది మృత్యు దోషానికి సంకేతం. ఇలా జరిగినప్పుడు భయపడవద్దు.వెంట‌నే స్నానం చేసి దేవుడి పూజ గదిలోకి వెళ్లి దేవుడికి నమస్కరించుకోండి, అంతా మంచే జరుగుతుంది.

Advertisement