అక్షరటుడే, వెబ్డెస్క్: Ambani stocks | ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ(Ambani) కంపెనీలు కొంత కాలంగా ఇన్వెస్టర్లకు నష్టాలనే మిగులుస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్‌లో domestic stock market పెద్దన్న అయిన రిలయన్స్ Reliance కూడా మూడేళ్లుగా ఎలాంటి రిటర్న్స్ ఇవ్వలేదు. కొన్ని కంపెనీలయితే రోజురోజుకు పడిపోతున్నాయి. అంబానీ గ్రూప్‌లో Ambani group దాదాపు అన్ని కంపెనీలు 52 వారాల కనిష్ట స్థాయిల వద్ద కొనసాగుతుండడం గమనార్హం. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా వెలుగొందుతున్న అంబానీ కంపెనీలకు ఏమయ్యిందన్న సంశయం ఇన్వెస్టర్లను వేధిస్తోంది.
Ambani stocks | RIL
రిలయన్స్ ఇండస్ట్రీస్ Reliance Industries షేరు ధర ప్రస్తుతం రూ. 1,182 వద్ద కొనసాగుతోంది. 52 వారాల గరిష్ట ధర రూ. 1,608 కాగా 52 వారాల కనిష్ట ధర 1,114. ఐదేళ్లలో లాంగ్ టైం ఇన్వెస్టర్లకు long-term investors 16 శాతం రాబడులు అందించిన ఈ కంపెనీ మూడేళ్లుగా ఎలాంటి రిటర్న్స్ ఇవ్వడంలేదు.
Ambani stocks | RIIL
రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ Reliance Industries and Infrastructure 52 వారాల గరిష్ట ధర రూ. 1,442 కాగా 52 వారాల కనిష్ట ధర 726. ప్రస్తుతం రూ. 770 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ ఐదేళ్లలో 28 శాతం రిటర్న్స్ ఇవ్వగా.. మూడేళ్లలో 2 శాతం నెగెటివ్ రిటర్న్స్ అందించింది.
Ambani stocks | SWSOLAR
స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యువబుల్ ఎనర్జీ కంపెనీ స్టాక్ సీఎంపీ Energy Company stock CMP రూ. 247. 52 వారాల గరిష్ట ధర రూ. 828 కాగా 52 వారాల కనిష్ట ధర 218. ఐదేళ్లలో 21 శాతం రాబడులు ఇచ్చిన ఈ సంస్థ.. మూడేళ్లలో రెండు శాతం నష్టాలనే మిగిల్చింది.
Ambani stocks | ALOKINDS
ఆలోక్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఐదేళ్లలో 25 శాతం రిటర్న్స్ అందించింది. అయితే మూడేళ్లుగా 19 శాతం నెగెటివ్ రిటర్న్స్ negative returns అందిస్తోంది. ప్రస్తుతం రూ. 15 వద్ద ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్.. 52 వారాల గరిష్ట ధర రూ. 30 కాగా 52 వారాల కనిష్ట ధర 14.
Ambani stocks | DEN
డెన్ నెట్‌వర్క్ సీఎంపీ Den Network CMP రూ. 30 వద్ద కొనసాగుతోంది. 52 వారాల గరిష్ట ధర రూ. 58.90 కాగా 52 వారాల కనిష్ట ధర 28.14. ఐదేళ్లలో లాంగ్ టైం ఇన్వెస్టర్లకు 16 శాతం రాబడులు అందించిన ఈ కంపెనీ మూడేళ్లుగా ఎలాంటి రిటర్న్స్ ఇవ్వడంలేదు. ఐదేళ్లలో రెండు శాతం, మూడేళ్లలో 11 శాతం నష్టాలనే మిగిల్చింది.
Ambani stocks | HATHWAY
హాథ్‌వే కేబుల్స్ Hathway Cables 52 వారాల గరిష్ట ధర రూ. 25.66 కాగా 52 వారాల కనిష్ట ధర 11.94. ప్రస్తుతం రూ. 13 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ ఐదేళ్లలో 2 శాతం, మూడేళ్లలో 14 శాతం నెగెటివ్ రిటర్న్స్ negative returns అందించింది.
Ambani stocks | NETWORK 18
నెట్‌వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కంపెనీ Media and Investments Company ఐదేళ్లలో 17 శాతం రిటర్న్స్ అందించింది. అయితే మూడేళ్లుగా 25 శాతం నెగెటివ్ రిటర్న్స్ negative returns అందిస్తోంది. ప్రస్తుతం రూ. 41 వద్ద ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్.. 52 వారాల గరిష్ట ధర రూ. 106 కాగా 52 వారాల కనిష్ట ధర 39.
Ambani stocks | JFSL
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ Jio Financial Services సంస్థ 2023 ఆగస్టులో లిస్టయ్యింది. ప్రస్తుతం రూ. 224 వద్ద కొనసాగుతోంది. ఈ కంపెనీ 52 వారాల గరిష్ట ధర రూ. 394 కాగా 52 వారాల కనిష్ట ధర 198.
Ambani stocks | JUST DIAL
జస్ట్ డయల్ Just Dial 52 వారాల గరిష్ట ధర రూ. 1,395 కాగా 52 వారాల కనిష్ట ధర 751. ప్రస్తుతం రూ. 801 వద్ద ట్రేడ్ అవుతోంది. ఐదేళ్లలో 19 శాతం రాబడులు అందించిన ఈ స్టాక్ మూడేళ్లుగా ఎలాంటి రిటర్న్స్ ఇవ్వడం లేదు.